Bill Gates appreciates PM Narendra Modi On COVID-19 Fight
కరోనాపై పోరాటంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాలకు వాటిని అవలంభించే తీరు చూసిన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రశంసలు గుప్పింస్తు ప్రధాన మంత్రి మోదికి ఒక లేఖ వ్రాశారు. కోవిడ్-19ను కట్టడి చేయడం కోసం భారత సర్కారు అద్భుతంగా పని చేస్తుందని, దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడం, హాట్స్పాట్లలో త్వరిత గతిన ఎక్కువ టెస్టులు చేయడం, వ్యాధి సోకిన వారిని ఐసోలేషన్, క్వారంటైన్లలో ఉంచడం, ఆరోగ్య రంగంపై అధికంగా ఖర్చుచేయడం మొదలగు చర్యలపై బిల్ గేట్స్ తన అభినందనలు తెలిపారు.
కరోనా ట్రాకింగ్ కోసం, కాంటాక్ట్ ట్రాకింగ్, ప్రజలను ఆరోగ్య సేవలకు అనుసంధానించడం కోసం ఆరోగ్య సేతు యాప్ ఎంతో తోడ్పడుతోందన్నారు. ప్రభుత్వం డిజిటల్ సేవలను వాడుకుంటున్న తీరు అద్భుతంగా ఉందని గేట్స్ ఫౌండేషన్ సహాయాధిపతి కొనియాడారు.