Bill Gates key comments on the Corona crisis:
ప్రపంచవ్యాప్తంగా గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ పై అందరూ స్పందిస్తున్నారు. తాజగా బిల్ గేట్స్ స్పందిస్తూ, వీలైనన్ని సార్లు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ కఠిన నిబందనల అమలు చేసే దేశాలు కరోనా సంక్షోభం నుంచి 6-10 వారాల్లో బయటపడతాయని తెలిపారు. ఆర్థికంగానే కాకుండా ప్రజల ఆరోగ్య పరంగానూ కోలుకుంటాయని తెలిపారు.
‘పరీక్షలు నిర్వహించడం, కఠినంగా నిబంధనలు అమలు చేయడం, దేశాన్ని షట్ డౌన్ చేయడంలో మంచి పనితీరు కనబరిచిన దేశాలు 6-10 వారాల్లో ఈ పరిస్థితి నుంచి బయటపడాయి. ఆర్థికంగా, ప్రజల ఆరోగ్య పరంగా కోలుకుంటాయి’ అని బిల్ గేట్స్ అన్నారు. అదే సమయంలో ప్రజలకు అనవసరం ఆందోళన కూడా తగదని సూచించారు. వీలైనన్ని సార్లు పరీక్షలు నిర్వహించడంతో పాటూ సామాజిక దూరం పాటించడంతో మంచి ఫలితాలు రాబట్టవచ్చని ఆయన సూచించారు.
కాగా కరోనా వైరస్ కేసులు 341కి పెరిగిన నేపథ్యంలో వాఘా సరిహద్దును రెండువారాల పాటు మూసివేస్తున్నట్టు పాకిస్థాన్ గురువారం ప్రకటించింది. భారత్-పాక్ దేశాల్లో కోవిడ్-19 మరింత ప్రబలకుండా తీసుకున్న చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్‌తో కలిసి పంచుకునే పశ్చిమ సరిహద్దును ఇప్పటికే మూసివేసింది.