Thursday, May 13, 2021

Latest Posts

వ్యాక్సిన్‌కు మరో 9 నెలలు తప్పదన్న బిల్ గేట్స్

Bill Gates says covid-19 vaccine may take at least 9 months

ఎక్కడ చూసినా కరోనా మహమ్మారి గురించే చర్చ. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా దీని గురించే తప్ప మరొకటి లేదు. అంతగా కరోనా ప్రభావం కమ్మేసింది. దీనికోసం ఎన్నో ప్రయోగాలు,అధ్యయనాలు నడుస్తున్నాయి. ఈనేపధ్యంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిలియనీర్ బిల్ గేట్స్ స్పందిస్తూ,.. తన గేట్స్‌నోట్స్ బ్లాగులో రాసిన వ్యాసంలో కోవిడ్-19 చికిత్సకు ఇప్పటి వరకు ఉపయోగిస్తున్న మందులు అంత సమర్థవంతమైనవి కాదన్నారు. ప్రస్తుతం వాడుతున్న మందులు చాలా మంది ప్రాణాలను కాపాడగలిగినప్పటికీ, అవి మనలను మళ్ళీ పాత రోజులకు తీసుకెళ్ళగలిగేటంత శక్తిమంతమైనవి కాదన్నారు.

నోవల్ కరోనా వైరస్ ఆవిర్భావానికి ముందటి పరిస్థితులు మళ్ళీ రావాలంటే కనీసం 9 నెలలు పడుతుందని అంచనా వేశారు. కోవిడ్-19 చికిత్సకు చాలా మందులను ప్రయత్నిస్తున్నప్పటికీ, కచ్చితంగా నివారించగలిగే వ్యాక్సిన్ రావాలంటే కనీసం 9 నెలలు పట్టే అవకాశం ఉందని తెలిపారు. వ్యాక్సిన్‌ను అభివృద్ధిపరచడానికి సాధారణంగా ఐదేళ్ళు పడుతుందని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సైంటిస్ట్‌లు సుమారు 9 నెలల నుంచి రెండేళ్ళలో కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్‌ను అభివృద్ధిపరచవచ్చునని పేర్కొన్నారు.కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ కూడా భాగం పంచుకుంటోంది.

కోవిడ్-19కు చికిత్స చేయడానికి దాదాపు కచ్చితమైన మందు ప్రస్తుతం లేదు కాబట్టి, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయవలసిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందని బిల్ గేట్స్ అన్నారు. మళ్ళీ సాధారణ స్థితికి చేరాలంటే, సురక్షితమైన, సమర్థవంతమైన వ్యాక్సిన్‌ అభివృద్ధిపరచవలసిన అవసరం ఉందన్నారు. కోట్లాది మోతాదుల వ్యాక్సిన్‌ను తయారు చేసి, ప్రపంచమంతటికీ పంపించవలసి ఉందన్నారు. ఇదంతా సాధ్యమైనంత త్వరగా జరగాలన్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss