Monday, May 10, 2021

Latest Posts

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ విడాకులు తీసుకుంటున్నారు

Bill Gates Taking Divorce

ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ గేట్స్ విడాకులు తీసుకుంటున్నారు. అతను విడాకులు తీసుకుంటున్నట్లు బిల్ గేట్స్, మెలిండా గేట్స్ ట్విటర్లో పోస్ట్ చేశారు. “ మేము చాలా సార్లు ఆలోచించిన తరువాత, మేము మా బంధాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాము,”.

అయితే వీరిద్దరు కలిసి స్థాపించిన బిల్ గేట్స్ ఫౌండేషన్ కోసం మాత్రం తాము కలిసే పని చేస్తామని అయితే తమ జీవిత భాగస్వామ్యంలో వీడిపోబోతున్నామని తెలిపారు.

వీరు స్థాపించిన బిల్ మరియు మెలిండా గేట్స్ ఫౌండేషన్, సుమారు 50 బిలియన్ డాలర్ల ఆదాయంతో అందరికీ సాయపడుతుంది. తాజాగా ఈ ఫౌండేషన్ కోవిడ్ తో పోరాడుతున్న వారికి ఒక బిలియన్ డాలర్లను సాయం చేశారు.

బిల్ మరియు మెలిండా గేట్స్ వివాహం చేసుకున్న 27 సంవత్సరాల తరువాత విడాకులు తీసుకోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. అయితే వీరి ముగ్గురి పిల్లల భవిష్యత్తు ఏమిటి అనేది తెలియాల్సి ఉంది. అలానే బిల్ గేట్స్ నెట్ వర్త్ 124 బిలియన్ డాలర్స్ కావడం విశేషం.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss