ఎన్నికల ముందు టిడిపిని దుమ్ముదులిపేసిన బిజెపి ఇప్పుడు వైసిపిని కూడా కడిగేస్తోంది. తాజాగా బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ రాజధాని గ్రామాల్లో కన్నా లక్ష్మీనారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ పాలన ఎలా ఉందొ పంచ్ వేశారు. ప్రజలకు చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ తీసుకెళ్లినట్లు గా జగన్ పాలన ఉందని అయన ధ్వజమెత్తారు.
మాఫియా దెబ్బకి ఇటుకలు కూడా కొనలేని పరిస్థితి వచ్చిందని కన్నా ధ్వజమెత్తారు. కూల్చడం, పాడు పెట్టడం తప్ప చేసిందేమీ లేదని ఆయన దుయ్యబట్టారు. ఇప్పుడు ఎన్నికలు పెడితే టీడీపీకి వచ్చినన్ని సీట్లు కూడా వైసీపీకి రావని కూడా ఆయన జోస్యం చెప్పారు.
అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి భయపడుతున్నారని, ప్రతిపక్ష నేతల్ని బ్లాక్మెయిల్ చేసేలా సీఎం జగన్ మాట్లాడుతున్నారని కన్నా మండిపడ్డారు. సీఎం మారినప్పుడల్లా రాజధానిని సంకన పెట్టుకుంటే, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారని కన్నా ఆందోళన వ్యక్తం చేశారు.