మసీదులో హనుమాన్ చాలీసా పారాయణం చేసిన ఓ బీజేపీ నేతతో సహా నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఉత్తరప్రదేశ్లోని మథురకు 20 కి.మీ దూరంలో ఉన్న గోవర్దన్-బార్సానా రోడ్డులో ఉన్న మసీదులో హనుమాన్ చాలీసా పఠించిన వీడియోను బీజేపీ నేత మనుపాల్ బాన్సాల్ ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో స్థానిక పోలీసులు ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఎస్పీ అభిషేక్ సింగ్ మాట్లాడుతూ బాన్సాల్ తరుచూ మసీదుకు వెళతడాని మాస్క్ పెద్ద మాల్వీ అలీ హస్సన్ అనుమతితోనే ప్రార్థనలు చేసినట్టు చెప్పారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కూడా అలీ హస్సన్ కూడా ఇదే విషయాన్నిస్పష్టం చేశారు. హిందువుల ప్రార్థనలు చేసేందుకు తానే బాన్సాల్ను అనుమతించినట్టు తెలిపారు.
ఇది కూడా చదవండి: