ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్లీ వాటర్ వార్ రోజురోజు పెరుగుతూ వస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు నీటి తరలింపు కోసం కొత్త ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం ససేమిరా అంటుంది. దాంతో కృష్ణానదీ యాజమాన్య బోర్డు రంగంలోకి దిగి ఇరు రాష్ట్రాలకు చెందిన కెఆర్ఎంబి సభ్యులు, అంతరాష్ట్ర చీఫ్ ఇంజనీర్ల సమక్షంలో సమస్యను తెలుసుకుని స్పందించేందుకు ఆన్లైన్ విచారణ చేపట్టింది. దాంతో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల పరంగానే కాకుండా పోతిరెడ్డి పాడు పంచాయతీ రాజకీయంగానూ దుమారం రేపుతోంది. అయితే ఇప్పటికే దీనిపై పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలు స్పందించారు వారిలో ఏపీకి చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
పోతిరెడ్డిపాడుపై జగన్ తీసుకున్న నిర్ణయాన్ని బిజెపి రాష్ట్ర శాఖ స్వాగతించినట్లు, ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో ఏలాంటి అక్రమాలు లేవని వెనకబడ్డ రాయలసీమకు నీరు ఇవ్వాల్సిందేనని పలువురు బిజేపి నాయకులు అభిప్రాయ పడ్డారు. అలాగే బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ శ్రీశైలం ప్రాజెక్టు ఏపీ భూభాగంలో ఉందని ఈ ప్రాజెక్టుపై తెలంగాణకు ఎలాంటి హక్కులు లేవని అలాగే జీవో నెంబర్ 203 విషయంలో తెలంగాణ మూర్ఖంగా వ్యవహరించ కూడదని వాటిని వ్యతిరేకిస్తే తెలంగాణలోని ప్రతి ప్రాజెక్టు కూడా చట్ట విరుద్ధమేనని ఆరోపించారు. జీవో నెంబర్ 203 విషయంలో జగన్ అసలు తగ్గొదని కావాలంటే దీనిపై పోరాటానికైనా సిద్ధపడాలని అంతేగాని వెనక్కి తగ్గకూడదని తేల్చిచెప్పారు. అవసరమైతే బీజేపీ తరపున తాను కేంద్రానికి విజ్ఞప్తి చేస్తానని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో తెరుచుకొనున్న ఐటి కంపెనీలు