ఏపి లో కరోనా నియంత్రణకు పరిసరాలలో, రోడ్ల మీద పిచికారీ చేస్తున్నది హైపో క్లోరైడ్ కాదా ? అది గోడలకు వేసే మామూలు సున్నమా ? ఏపిలో కుంభకోణం బయటపడిందా? అంటే… అవునంటున్నారు అధికారులు. రెండు జిల్లాలకు సంబందించిన అధికారుల సమన్వయము ద్వారా ఇది వెలుగులోకి వచ్చింది. అయితే ఇంతకీ విషయం ఏమిటంటే 70 కోట్లకు పైబడి కాకినాడకు చెందిన కాంట్రాక్టర్ నుంచి బ్లీచింగ్ పౌడర్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీనిని కరోనా వలన ఎఫెక్ట్ కాకుండా ప్రజా జీవనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో మరియు కంటైంమెంట్ జోన్లలో పిచికారీ చేయడానికి వినియోగిస్తున్నారు.
కాకపోతే ఇది అంతా ఎఫెక్ట్ గా పని చెయ్యటంలేదు అని గమనించడం లేదని జిల్లా కలెక్టర్ దృష్టికి రాగా, ఆ బ్లీచింగ్ కాంట్రాక్ట్ కాకినాడకు సంబందించిన కాంట్రాక్టర్ చేసినట్టుగా, ఆ బ్లీచింగ్ పౌడర్ పిడుగు రాళ్ళ ప్లాంట్ లో తయారైనదిగా వివరాలు ఉండగా, ఈ వివరాలు పరిశీలించమని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ గారిని కోరగా, పరిశీలించిన అధికారులు గుంటూరు జిల్లా, పిడుగురాళ్లలో అసలు ఎటువంటి బ్లీచింగ్ ప్లాంట్ లేదని నిర్దారించారు. పిడుగురాళ్లలో ఎక్కువగా సున్నపు రాయి ఎక్కువగా ఉంటుంది అని, బ్లీచింగ్ కి బదులుగా వీటి మిశ్రమాన్ని సరఫరా చేశారా అనే అనుమానాలు వున్నాయి. కాగా అధికారులు దీనిపై దర్యాప్తు జరగాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇది కూడా చూడండి: భర్తని ఉతికేసిన సాగరకన్య..!