Monday, April 19, 2021

Latest Posts

బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ ఇకలేరు..!!

bollywood actor irrfan khan passed away in mumbai

బాలీవుడ్‌ విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌(54) గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ… మంగళవారం ముంబైలోని కోకిలాబెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆస్పత్రిలో చేరగా.. బుధవారం ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దానికి తోడు రెండు రోజుల క్రితం తల్లి సయీద బేగం ను కోల్పోయిన ఇర్ఫాన్ ఖాన్ ఆమె అంత్యక్రియలకు కూడా హాజరుకాలేకపోగా వీడియో కాల్‌లో తల్లి అంత్యక్రియలను చూసిన విషయం తెలిసిందే.

గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌ వ్యాధితో పోరాటం చేస్తున్న ఈ నటుడు కొన్నాళ్లు లండన్‌లో చికిత్స కూడా తీసుకున్నాడు.అయితే క్యాన్సర్‌ నుంచి కోలుకున్న అనంతరం మళ్లీ ఆంగ్రేజీ మీడియం సినిమాలో నటించారు. అయితే తిరిగి అనారోగ్యానికి గురవడంతో ఈ సినిమా ప్రమోషన్లకు ఇర్ఫాన్‌ దూరంగా ఉన్నారు. 

ఇర్ఫాన్‌కు భార్య సుతాపా సిక్దార్‌, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇర్ఫాన్‌ బాలీవుడ్‌ సినిమాలే కాకుండా స్లమ్‌డాగ్‌ మిలియనీర్, ఎ మైటీ హార్ట్‌, జురాసిక్‌ వరల్డ్‌, లైఫ్‌ ఆఫ్‌ పై వంటి హాలీవుడ్‌ ఉత్తమ చిత్రాల్లోనూ నటించి మంచి పేరును సంపాదించారు. గతంలో ఈయన నటించిన పాన్ సింగ్ తోమర్ సినిమాకు గాను జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. ఈయన మొదటి సినిమా ‘సలామ్ బాంబే’. తెలుగులో కూడా ఈయన మహేష్ బాబు హీరోగా నటించిన సైనికుడు సినిమాలో నటించారు. అయితే ఇర్ఫాన్ ఖాన్ మృతితో బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss