Monday, July 26, 2021

Latest Posts

కియారా అద్వాని స్టంట్స్ అదరగొట్టేస్తుంది

Bollywood Actress Kiara Advani Stunts

బాలీవుడ్ లో ఫిట్నెస్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టే నటులలో ఒకరు కియారా అద్వాని. అయితే లాక్ డౌన్ కారణంగా ఆమె చాలా రోజుల పాటు వర్క్ అవుట్ కి దూరంగా ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ ఆంక్షలను సడలింపు చేయడంతో ఆమె తిరిగి జిమ్ ని ప్రారంభించింది.

ఇదే విషయమై ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్టుని షేర్ చేసింది. ఈ నటి తన మార్షల్ ఆర్ట్స్ మరియు టైక్వాండో ప్రముఖ కోచ్ అయిన లలిత్ గురుంగ్ లతో కలిసి ఆమె ప్రాక్టీస్ చేస్తున్న వీడియో పోస్ట్ చేసింది. ఇందులో ఆమె హై కిక్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. అయితే ఆమె చాలా రోజుల తర్వాత చేస్తున్న ఆమె వర్క్ అవుట్ పై నమ్మకం ఉంచినందుకు గురువుకి కృతజ్ఞతలు తెలిపింది.

ఇక ఆమె త్వరలోనే ఎన్‌టి‌ఆర్, కొరటాల శివ సినిమాలో హీరోయిన్ గా చేసే అవకాశం కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss