Wednesday, June 23, 2021

Latest Posts

కరోనా తో మరణించిన బాలీవుడ్ ప్ర‌ఖ్యాత నిర్మాత‌

బాలీవుడ్‌లో వరస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. వరసగా ప్రముఖులు కన్ను మూస్తూనే ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటికే దాదాపు 20 మంది వరకు చనిపోయారు. ఇప్పటికే సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ కరోనాతోనే చనిపోగా ఇప్పుడు మరో ప్రముఖ నిర్మాత కరోనా కరణంతో చనిపోవడంతో  బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కరోనా సోకడంతో బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత అనీల్ సూరి (77) చనిపోయారు.

అనీల్ సోదరుడు నిర్మాత రాజీవ్ సూరీ మాట్లాడుతూ ప్రముఖ నిర్మాత అనీల్ సూరి జూన్ 2 నుండి హై ఫీవర్‌తో బాధ పడుతున్నాడని తర్వాత రోజు నుంచే అతని ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో వెంటనే ముంబై లీలావతి, హిందూజా ఆసుపత్రికి తీసుకెళ్లగా వారు అడ్మిట్ చేసుకునేందుకు నిరాకరించడంతో ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో అనిల్ కు చికిత్స అందించినట్లు, అక్కడే చికిత్స పొందుతూ జూన్ 4 సాయంత్రం మరణించినట్లు ఆయన మీడియాకు  తెలియ జేశారు. కరోనాతో మృతి చెందటం వల్ల మరుసటి రోజు ఉదయం కేవలం కొంత మంది కుటుంబ సభ్యుల సమక్షంలో అనిల్ అంత్యక్రియలు జరిగినట్లు తెలుస్తుంది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss