Home సినిమా వార్తలు నటుడు ఇర్ఫాన్ ఖాన్ అస్వస్థత

నటుడు ఇర్ఫాన్ ఖాన్ అస్వస్థత

Bollywood iconic actor Irrfan Khan has fallen ill

బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అస్వస్థతకు గురయ్యారు. 2018లో న్యూరోఎండోక్రైన్‌ ట్యూమర్ అనే అరుదైన క్యాన్సర్ వ్యాధి తనకు సోకినట్లు ఇర్ఫాన్ ఖాన్‌ తెలిపారు. దానికి తోడు రెండు రోజుల క్రితం తల్లి సయీద బేగం ను కోల్పోయిన ఇర్ఫాన్ ఖాన్ ఆమె అంత్యక్రియలకు కూడా హాజరుకాలేకపోగా వీడియో కాల్‌లో తల్లి అంత్యక్రియలను చూసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఉన్నట్లుండి ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యారు.  దాంతో ముంబయిలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి ఆయన్ను తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

ఇప్పుడు ఇర్ఫాన్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. క్యాన్సర్ వ్యాధి వల్ల ఆయన విదేశాలకు వెళ్లి చికిత్స కూడా తీసుకున్నా పూర్తిగా కోలుకోలేదు అని ఆయనే స్వయంగా మీడియా ముందు కొన్ని రోజుల క్రితం చెప్పారు. అలాగే ఆ మధ్యన మరోసారి తన ఆరోగ్యంపై స్పందిస్తూ తాను పూర్తిగా కోలుకోలేదని ఐనా ఇక  విదేశాలకు వెళ్లకుండా ఇక భారత్ లోనే ఉంటూ రెగ్యులర్ చెకప్ చేయెంచూ కుంటానన్నారు.

Exit mobile version