Thursday, May 13, 2021

Latest Posts

కుమారుడికి డాక్ట‌ర్ల పేర్లు పెట్టిన బ్రిటన్ ప్రధాని

Boris Johnson names son after doctors who saved

మార్చి నెలలో తీవ్ర అనారోగ్యనికి గురి అయిన  బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కి తరువాత  కరోనా  సోకిన‌ట్టు నిర్ధార‌ణ అయ్యింది. దాంతో  ఆయన ఇంటి వద్ద ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఐనా కూడా అది తగ్గక పోగా ప్ర‌మాద‌క‌రంగా మరడంతో  ఏప్రిల్ 7న హాస్పిటల్‌లో ఐసీయూలో ఉంచి చికిత్స అందజేశారు. తర్వాత కొన్ని రోజులకు ఆయన కోలుకోవడంతో ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయిన తర్వాత ఆయన వైధ్యులను దేవుళ్ళు గా అభివర్ణిచారు. అంతే కాకుండా వారికి పుట్టిన బిడ్డకు ట్రీట్మెంట్ చేసిన డాక్ట‌ర్స్ ల పేర్లు పెట్టుకున్నారు.

వివరాలలోకి వెళ్తే  ఇటీవ‌లే బోరిస్ జాన్సన్ భార్య క్యారీ సీమండ్స్ పండంటి మగ  బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. మృత్యు ఒడిలోకి వెళ్లిన త‌న‌కు వైద్యం చేసిన కాపాడిన డాక్ట‌ర్స్ రుణం తీర్చుకోవడానికి ఆయనకు ఇదే సమయమని వారికి పుట్టిన కుమారుడికి త‌న‌కు ట్రీట్మెంట్ చేసిన డాక్ట‌ర్స్ పేరు పెట్టుకున్నారు.  ఈ విషయాన్ని ప్రధాని భార్య సీమండ్స్ అక్కడి సోష‌ల్ మీడియా ద్వారా శనివారం వెల్లడించారు. బోరిస్ తాత విల్‌ఫ్రెడ్  సీమండ్స్ తాత లౌరీ జాన్సన్‌కు ట్రీట్మెంట్ అందించిన‌ వైద్యులు నిక్ ప్రైస్, నిక్ హర్ట్. ఇలా నలుగురి పేర్లు కలిపి విల్‌ఫ్రెడ్ లౌరీ నికోలస్ జాన్సన్ అని కుమారుడికి పెట్టినట్టు తెలిపారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss