Botsa Satyanarayana Shocking Comments On YS Jagan
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనదైన శైలిలో అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతూ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఆయన తొంబై శాతం హామీలను కూడా నెరవేర్చి శభాష్ సిఎం అనిపించుకున్నారు. ఇవే కాకుండా తన మంత్రులను సైతం పరుగులు పెట్టిస్తూ ఏపీలో పాలనను గాడిన పెట్టారు. ఈ నేపధ్యంలో దేశం మొత్తం చూసేలా ఏకంగా 30 లక్షలకు పైగా ఇళ్ళ పట్టాలను పేదలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని జగన్ తాజాగా ప్రారంభించారు.
దీని పై స్పందిస్తూ వైసీపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మూడు దశాబ్దాలుగా ఇంతటి పెద్ద కార్యక్రమం ఎక్కడా జరగలేదని ఆయన అన్నారు. తన పొలిటికల్ కెరీర్ లో జగన్ లాంటి సీఎంని చూడలేదని కూడా చెప్పారు. జగన్ అనుకుంటే తప్పక చేస్తారు, ఆయన పేదల సీఎం అంటూ బొత్స కితాబు ఇచ్చారు.
రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఇల్లు లేకుండా ఉండరాదు అన్నది జగన్ విధానమని వైసీపీ సీనియర్ నేత బొత్స అన్నారు. గజం అయిదు నుంచి పదివేల విలువ చేసే ఈ రోజుల్లో జగన్ ఉచితంగా విలువైన భూమి ఇవ్వడమే కాకుండా ప్రభుత్వమే ఇల్లు కట్టించే ఏర్పాట్లు చేశారని బొత్స చెప్పుకొచ్చారు. ఇది నిజంగా గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి: