Bounce App In Losses
రవాణా రంగంలో నూతన టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రారంభించిన నూతన సంస్థ బౌన్స్. కానీ సంస్థ చేసిన కొన్నిలోపాల వల్ల అది పూర్తిగా నష్టాలను చవిచూసింది. బెంగుళూరు హైదరాబాద్ తో పాటు ప్రముఖ మెట్రో నగరాలలో తొలుత ప్రారంభించిన ఈ సంస్థ మొబైల్ యాప్ ద్వారా పొందే ఓటీపీ నుండి ఈ ద్విచక్ర వాహనాలకు అద్దెకు తీసుకోవచ్చు. తాళం లేకుండానే వాహనాలను స్టార్ట్ చేసుకొని వినియోగదారుని అవసరం తీరిన తరువాత ఆన్లైన్ లో అద్దె చెల్లించి, వాహనాన్ని తిరిగి అప్పగించ్చవచ్చు.
అదే విధంగా వేరే వినియోదాగదారుని జియో లొకేషన్ ద్వారా ఆ వాహనాన్ని గుర్తించి అతను కూడా అద్దెకు తీసుకోవచ్చు. కానీ సంస్థ వాళ్లు చేసిన చేసిన తప్పిదం ఇదే. కొందరు వాళ్ళ అవసరం తీరాక నడిరోడ్డు పై ఆ వాహనాన్ని వదిలేయడం, సరైన పార్కింగ్ అనుమతి లేని ప్రాంతాలలో పార్క్ చేయకడం వంటివి జరిగాయి. కొంత మంది ఆ వాహనాలలోని పరికరాలను, హెల్మెట్లను దొంగిలించిన సందర్బాలు చాలా ఉన్నాయి. దీనితో ఆ సంస్థ ఇప్పుడు నష్టాల్లో కూరుకుపోయింది. అయితే వీరి ఆలోచన కొత్తదే కానీ మనమే చేజేతులా అద్భుతమైన ఆలోచనను ఆగం చేశాం.! ఇతర దేశాలలో దీనిని ప్రయత్నిస్తే మంచి విజయం సాదించవచ్చు. కానీ భారతీయుల వద్ద ఇది అంతలా వర్క్ అవుట్ అవ్వకపోవచ్చు.
ఇవి కూడా చదవండి: