Friday, January 22, 2021

Latest Posts

చిరంజీవితో సినిమా గురించి చెప్పిన బోయపాటి

Boyapaati reveals his movie with mega star Chiranjeevi :

బోయపాటి శ్రీను “భధ్ర” సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ స్థానాన్ని తన మాస్ డైరక్షన్ తో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. భధ్ర సినిమా అప్పట్లో రవి తేజ ను మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. ఆ సినిమా తర్వాత బోయపాటి శ్రీను “తులసి” సినిమాను వెంకటేష్ తో తీయగా ఇది కూడా అంతటి విజయం దక్కించుకుంది. కాగా తాను మాత్రం ఇండస్ట్రీ మొత్తానికి గుర్తుండే హిట్ ఇచ్చింది మాత్రం బాలకృష్ణతో “సింహా”. హిట్ లేక ఉన్న బాలయ్య బాబుకు సింహా సినిమా మునుపటి ఉత్సాహాన్ని అభిమానులలో, మరింత జోష్ ని బలయ్యాలో ఇచ్చింది. ఇక ఆ సినిమా తర్వాత తీసిన లెజెండ్ కూడా తిరుగులేని హిట్ కొట్టింది. ఈ రెండు సినిమాలతో బాలయ్య బాబు మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.

కాగా తాన సినీ ప్రయాణం గురించి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ చిరంజీవి గారితో సినిమా ఛాన్స్ వస్తే అస్సలు వదులుకొనని, మెగా స్టార్ తో సినిమా చెయ్యడం నా కల అని అన్నారు. అలాగే తాను డైరెక్టర్ అవ్వడాన్నికి 3 సంవత్సరాలు భద్ర సినిమా కధ పట్టుకుని అందరి దగ్గరికి తిరిగానని, ఆ సమయంలో బన్నీ తనకు దిల్ రాజు దగ్గరకు తీసుకెళ్లి సినిమా ఓకే చేయించాడని. అప్పుడు బన్నీ ఆర్య సినిమా షూటింగ్ లో ఉండడం వలన నా సినిమా చెయ్యలేకపోయాడని చెప్పారు. బాలయ్య బాబు నన్ను నమ్మి సింహా సినిమా చేశారని, ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేసుకోలేదని తెలిపారు. ఈ క్వారంటైన్ టైమ్ ను బాలయ్య బాబు సినిమా స్క్రిప్ట్ పనులతో గడుపుతున్నానని తెలియచేసారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss