Wednesday, December 1, 2021

Latest Posts

బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిస్ క్షిపణి విజయవంతం

రక్షణ రంగంతో భారత్ మరో ముందడుగు వేసింది.  రక్షణ రంగానికి చెందిన క్షిపణుల ప్రయోగాలను వరసగా నిర్వహిస్తూ భారత్ ప్రత్యర్థులకు చెమట్లు పుట్టిస్తోంది. గత 35 రోజుల వ్యవధిలో ఇండియా 9 రకాల క్షిపణులను విజయవంతంగా ప్రయోగించింది . కాగా, ఈరోజు బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని నావికాదళం ప్రయోగిందించింది. నావికా దళానికి చెందిన యుద్ధనౌక స్టెల్త్ డిస్ట్రాయర్ నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు. సరైన ఖచ్చితత్వంతో అరేబియా మహాసముద్రంలో నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించినట్టు డిఆర్డివో ట్విటర్ లో ప్రకటించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నావికాదళం తయారు చేసిన యుద్ధ నౌక స్టెల్త్ డిస్ట్రాయర్. దీనిపై నుంచి బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగం విజయవంతం కావడంతో భారత్ రక్షణ రంగంలో మరింత బలపడింది. బ్రహ్మోస్ క్షిపణులు భారత సాయుధ దళాల సామర్థ్యాలను అనేక విధాలుగా పెంచుతాయని కేంద్ర రక్షణశాఖ తెలియజేసింది.

ఇది కూడా చదవండి:  

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss