Brazilian President Jair Bolsonaro quotes Ramayana
ప్రస్తుత పరిస్థితులలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఒక సంజీవనిగా ప్రపంచ దేశాలు భావిస్తునాయి. భారత్ ఈ ఔషధాన్ని పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేస్తుండటంతో అన్ని దేశాలు మనవైపే చూస్తున్నాయి. కానీ కరోనా చికిత్సకు మనకు సరిపడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఎగుమతులపై ఇటీవల కేంద్రం నిషేధం విధించింది. ప్రస్తుతం కరోనా వైరస్‌ను కట్టడి చేయడనికి వేరే దారి లేక మలేరియా చికిత్సలో వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఆశాకిరణంలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో క్లోరోక్విన్‌ను తమకు సరఫరా చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరారు. దీంతో కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. మన అవసరాలకు తగిన నిల్వలు ఉంచుకొని, మిగతావి కరోనా తీవ్రంగా ఉన్న దేశాలకు ఎగుమతి చేయాలని కేంద్ర క్యాబినేట్ నిర్ణయించింది.
కొన్ని దేశాలు తమకు కూడా ఈ ఔషధాన్ని ఇచ్చి ఆదుకోవాలని అర్ధిస్తున్నాయి. అలా అభ్యర్దిస్తున్న వారిలో బ్రెజిల్ కూడా ఒక్కటి. కానీ వారు అడిగిన తీరు అందరిలోనూ ఒకింత ఆశ్చరయానికి గురిచేస్తుంది. ఈ ఔషధాన్ని సంజీవనిగా, భారత్‌ను హనుమంతుడిగా పోల్చుతూ బోల్సానారో లేఖ రాయడం విశేషం. లంకలో మూర్ఛపోయిన లక్ష్మణుడి కోసం హిమాలయాల నుంచి హనుమంతుడు సంజీవనిని తెచ్చినట్లు, అనారోగ్యంతో ఉన్నవారిని ఏసు స్వస్థపరిచినట్టు..
చూపులేనివారికి బార్టిమేయ్ చూపు పునరుద్ధరించినట్టు తమకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇవ్వండి. ప్రపంచ సంక్షోభాన్ని భారత్, బ్రెజిల్ సంయుక్తంగా అధిగమించి ప్రజల మన్ననలు పొందుతాయి’అని బ్రెజిల్ అధ్యక్షుడు తన లేఖలో పేర్కొన్నారు. ఈ విదంగా హనుమాన్ జయంతి సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది.