Friday, March 5, 2021

Latest Posts

పెళ్లిపీటల మీద నుంచి వెళ్ళిపోయిన యువతి తర్వాత ప్రియుడితో…

Bride Eloped From Marriage

ఇష్టం లేని వ్యక్తితో బలవంతంగా వివాహం చేస్తున్నారని ఓ యువతి పెళ్లిపీటల మీద నుంచి లేచి వెళ్లిపోయింది . అయితే తరువాత శుక్రవారం ప్రియుడి వద్దకు వెళ్ళి ఓ ఆలయంలో పెళ్లి చేసుకొని ప్రేమికులిద్దరూ ఒక్కటయ్యారు.

పూర్తి వివరాలు పరిశీలించగా మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండల గుండెపుడి గ్రామానికి చెందిన ఓ యువకుడితో కురవి మండలం కాంపెల్లికి చెందిన దివ్య వివాహాన్ని పెద్దల సమక్షంలో నిర్ణయించారు. అయితే ఈ నేపథ్యంలో గురువారం మరిపెడలో వివాహం జరుగుతున్న క్రమంలో వధువు పెళ్లి పీటల మీద నుంచి లేచి 100కు నంబర్‌కు ఫోన్‌ చేసి పోలీసులను ఆశ్రయించింది.

తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, కాంపెల్లి గ్రామానికి చెందిన కొల్లు నరేశ్‌ను ప్రేమించినట్లు చెప్పింది. దీంతో శుక్రవారం మహబూబాబాద్‌ మండలం అనంతారం జగన్నాథ వెంకటేశ్వర ఆలయంలో దివ్య, నరేశ్‌ దండలు మార్చుకుని ప్రేమ వివాహం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss