Tuesday, April 13, 2021

Latest Posts

పెళ్లిలో భర్త పర్మిషన్‌తో లవర్‌తో అలా

ఈ రోజుల్లో ప్రేమించిన వారంతా పెళ్లి చేసుకోవడం లేదు. ఇంట్లో పెద్దలని ఒప్పించలేకో లేక వేర్వేరు కారణాల వల్ల ప్రేమికులు విడిపోవడం.. వేరే వాళ్ళతో పెళ్లి కావడం సాధారణంగా జరుగుతుంది. అయితే ఇదంతా సహజమే అయినా ఆ ప్రియురాలి లేదా ప్రియుడు పెళ్ళికి ఆ మాజీ ప్రియురాలు కానీ ప్రియుడు వెళితే ఆ పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఎవరికీ చెప్పనవసరం లేదు.

ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఓ యువతికి ప్రేమించిన వ్యక్తితో కాకుండా మరొకరితో వివాహం జరిగింది. మాజీ ప్రియుడు ఆ పెళ్లికి హాజరయ్యాడు. దాంతో యువతి ఏం చేసిందంటే ఆ భర్త అనుమతితో అతడిని హగ్‌ చేసుకుంది. అయితే ఇదంతా కూడా ఇండోనేషియాలో జరిగింది. పెళ్లి సమయంలో మాజీ ప్రియుడు వేదిక మీదకు ఎక్కి నూతన దంపతులకు శుభాకాంక్షలు చెప్పాలని భావిస్తాడు. తన మాజీ గర్ల్‌ ఫ్రెండ్‌కి షేక్‌ హ్యాండ్‌ ఇవ్వాలనకుంటాడు. అయితే ఆమె అతడికి చేయి ఇవ్వకుండా.. భర్త వైపు చూసి.. ఒక్కసారి నేను తనను హగ్‌ చేసుకోవచ్చా అని అడుగుతుంది.

వరుడు ఇదంతా చూసి షాక్‌ లో ఉన్నా విశాల హృదయంతో సరే అంటాడు. ఇక ఆ పెళ్లి కూతురు మాజీ ప్రియుడిని హత్తుకుంటుంది. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్చల్ గా మారింది. అయితే ఇది చూసిన నెటిజన్స్ మాత్రం “నీ బ్రతుకు బస్టాండ్ అయిపోయిద్ది బ్రదర్” అంటూ ట్రోల్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss