భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్నా టెస్ట్ సిరీస్ లో భారత్ ను గాయాల బెడద వెంటాడుతుంది. తాజాగా నాలుగో టెస్టు ఆరంభానికి ముందు భారత జట్టుకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాలుగో రోజు బౌలింగ్ చేస్తూ గాయపడిన భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా కీలకమైన నాలుగో టెస్టుకి దూరమైనట్టు బిసిసిఐ తెలిపింది.
ఇప్పటికే షమీ, ఉమేశ్ యాదవ్ వంటి సీనియర్లు పేసర్లు గాయం కావటంతో ఈ సిరీస్ భారమంతా బుమ్రానే మోస్తున్నాడు. తాజాగా ఇప్పుడు అతను కూడా దూరం కావడంతో నాలుగో టెస్ట్‌లో భారత్ చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఇతని స్థానంలో నటరాజన్ నాలుగో టెస్ట్ లో ఆరంగేట్రం చేసే అవకాశముంది. బుమ్రానే కాకుండా హనుమ విహారి, అశ్విన్ కూడా వచ్చే మ్యాచ్ లో ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. భారత్ నంబర్ 1 ఆల్ రౌండర్ జడేజా ఇప్పటికే తరువాత మ్యాచ్ కి దూరమయ్యిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి: