Bunny requesting mahesh babu for his next film:
ఒక్కొక్కరికి ఒక్కో డ్రీమ్ ఉంటుంది. లక్ష్యం,డ్రీమ్ లేకుంటే ఏమీ సాధించలేం. అయితే కొన్ని కలలు సాకారం అవుతాయి. కొన్ని కృషి చేసినా అవ్వవు. కొన్ని కలం కలిసిరావాలి. సరిగ్గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కలను నిజం చేసుకోడానికి తెగ ఉబలాటపడిపోతున్నాడట. అదేంటంటే తన మావయ్య మెగాస్టార్ చిరంజీవితో కల్సి నటించాలని ఉందట. అందుకోసం ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుని బతిమాలుకుంటున్నాడని టాక్ నడుస్తోంది. ఓ పాత్ర విషయంలో బన్నీ ప్రాధేయ పడుతూ,ఆ ఒక్కటి వదిలెయ్యి ప్లీజ్ అంటున్నాడట.
చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న సినిమాలో మహేష్ ని 40నిమిషాల నిడివి గల పాత్రకోసం తీసుకుతున్నారన్న టాక్ వచ్చింది. ఇందులో నటించడానికి మహేష్ ఒకే చెప్పడంతో రేపో మాపో అధికారికంగా ప్రకటన రావడమే తరువాయి అని కూడా అంటున్నారు. అయితే మావయ్య చిరుతో నటించాలన్న కోరిక ఎప్పటినుంచో ఉందని,అందుచేత నువ్వు వదిలేస్తే ఆ ఛాన్స్ నాకే వస్తుందని మహేష్ ని బన్నీ బతిమాలుతున్నట్లు, వార్తలు వైరల్ అవుతున్నాయి. అవసరమైతే తండ్రి అరవింద్ ని రంగంలోకి దించాలని కూడా బన్నీ డిసైడ్ అయ్యాడట.
వాస్తవానికి ఈ సంక్రాంతికి ఓపక్క మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు, మరోపక్క అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురంలో మూవీస్ విడుదల సందర్బంగా రచ్చ రచ్చ అయింది. రిలీజ్ డేట్స్ దగ్గర నుంచి అన్ని విషయాల్లో పెద్ద తతంగమే నడిచింది. ఎఫ్ 2తో బిగ్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు రూపుదిద్దుకోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో అలవైకుంఠపురంలో వచ్చింది. ఒక్కరోజు తేడాలో సంక్రాంతి బరిలో నిల్చిన ఈ మూవీస్ తో మహేష్,బన్నీల నడుమ సంక్రాంతి పందెం కోళ్ల ఫైట్ లా సాగింది. ఇక కలెక్షన్స్,ఇండస్ట్రీ హిట్ వంటి విషయాల్లో కూడా పోటాపోటీగా ప్రకటనలు జారీ అయ్యాయి. ఇదంతా చూసినోళ్లు మహేష్,బన్నీల మధ్య నిజంగానే గొడవ అయినట్లు ఫీలయ్యారు. కానీ వాళ్ళు మంచి ఫ్రెండ్స్ లా ఉంటారని తాజా ఘటన రుజువుచేస్తోంది.