ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాలపై భారీ అంచనాలుండడం సహజం. అందునా త్రివిక్రమ్ శ్రీనివాస్,అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న అలవైకుంఠపురంలో సినిమాకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వీరిద్దరి కాంబోలో జులాయి,సన్నాఫ్ సత్యమూర్తి మూవీ రెండూ హిట్ కొట్టడంతో మూడవ చిత్రం గా వస్తున్న అలవైకుంఠపురంలో సినిమా పై సహజంగానే భారీ క్రేజ్ వచ్చేసింది.
చాలా ముందుగానే విడుదల చేసిన సామజ వరగమన, రాములో రాములా,బుట్టబొమ్మ సాంగ్స్ కి వచ్చిన వ్యూస్ అదిరిపోయాయి. ముఖ్యంగా తమన్ సంగీతం వీరలెవెల్లో ఉందని అంటున్నారు. సామజ వరగమన సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయిందో బుట్ట బొమ్మ సాంగ్ కూడా అదే రేంజ్ లో హిట్ అయింది. ఇక బుట్టబొమ్మ సాంగ్ కి ప్రోమోను విడుదల చేయగా షోషల్ మీడియాలో ఊపేస్తోంది. ఈ సాంగ్ లో బన్నీ ,పూజా లుక్ చూస్తే వారెవ్వా అన్నట్టుంది.
బన్నీ మెట్ల నుంచి జారుతూ వేసే స్టెప్స్ సూపర్ గా ఉన్నాయి. లిరిక్ తగ్గట్టు ఓ బుట్టబొమ్మలా ఉందని, బాపు బొమ్మలా కనువిందు చేస్తోందని అంటున్నారు. పింక్ అండ్ గ్రీన్ కాస్ట్యూమ్స్ లో ఆమె నవ్వుతూ ఓ ఏంజెల్ లా ఉందట. ఈ సాంగ్ లో ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ కి కుర్రకారుకి మతులు పోతున్నాయట. బుట్టబొమ్మ అనే లిరిక్ సమయంలో బన్నీ,పూజ వేసే స్టెప్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. పూజా అయితే ఇప్పటివరకూ ఏ మూవీలో కనిపించనంత అందంగా ఈ పాటలో దర్శనమిచ్చిందని అంటున్నారు.