Tuesday, May 18, 2021

Latest Posts

తాజ్ మహల్ పై కరోనా ఎఫెక్ట్ – మూసెయ్యాలని లేఖ

By corona effect Taj Mahal and All monuments should be closed:

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఎఫెక్ట్ ఇప్పుడు పర్యాటక ప్రాంతాలను తాకుతుందన్న అనుమానాలు ఏర్పడ్డాయి. 98,441 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా, ఇప్పటి వరకు కరోనా మృతులు 3,387పైనే అని తేలింది. కోలుకున్నవారు 55,661గా చెబుతున్నారు. చైనాలో కరోనా పాజిటివ్‌ కేసులు 80,555, మృతులు 3,042గా ప్రస్తుతానికి తేల్చారు. అయితే ఇవి ఇంకా ఎక్కువే ఉంటాయని,లెక్కలు సరిగ్గా తేల్చడం లేదని విమర్శలు వస్తున్నాయి.
ముఖ్యంగా భారతదేశంలో పలు పర్యాటక కేంద్రాలను తాత్కాలికంగా మూసివేయాలన్న డిమాండ్ వస్తోంది.

By corona effect Taj Mahal and All monuments should be closed

ఇందులో భాగంగా ఆగ్రా నగరంలోని తాజ్‌మహల్‌‌తోపాటు ఇతర పురాతన కట్టడాలను ముందుజాగ్రత్త చర్యగా మూసివేయాలని ఆగ్రా మేయరు నవీన్ జైన్ కేంద్రప్రభుత్వాన్ని కోరారు ‘‘తాజ్‌మహల్‌‌ను చూసేందుకు విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఆగ్రా నగరానికి వస్తున్నారు, దీనివల్ల ఆగ్రా నగరంలో కరోనావైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. కరోనా వైరస్ అదుపులోకి వచ్చే వరకూ తాజ్‌మహల్‌‌తోపాటు ఫతేపూర్ సిక్రీ కోట, ఆగ్రాలోని కోట, ఇతర పురాతన కట్టడాలను మూసివేసి పర్యాటకులు రాకుండా చర్యలు తీసుకోవాలి’’ అని మేయరు ఆ లేఖలో కోరారు.

కాగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తాజ్‌మహల్‌ ను చూసేందుకు వచ్చిన 2,915 మంది విదేశీ పర్యాటకులను ఆగ్రా జిల్లా వైద్యాధికారులు పరీక్షించగా, వారిలో 708 మందిని హోంఐసోలేషన్ కు తరలించారు. ముగ్గురు విదేశీ పర్యాటకులకు కరోనా వైరస్ లక్షణాలుండటంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని ఆగ్రా వైద్యాధికారులు అంటున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss