Tuesday, May 18, 2021

Latest Posts

CA EXAMS: సీఏ కొత్త పరీక్ష తేదీలు ప్రకటించిన ఐసీఏఐ..!!

CA Exams 2020 Postponed

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) మరోసారి సీఎ పరీక్షల్ని వాయిదా వేసింది. మే 17 వరకు లాక్ డౌన్ పొడిగించిన నేపద్యం లో మేలో జరగాల్సిన పరీక్షల్ని జూన్‌ 19 నుంచి జులై 4 వరకు జరుపుతామని ప్రకటించింది. ఈ మేరకు సీఏ ఫౌండేషన్ కోర్స్, సీఏ ఇంటర్మీడియట్, సీఏ ఫైనల్ కోర్స్ ఎగ్జామ్స్ జూలై, ఆగస్టులో నిర్వహించనుంది. ఈ పరీక్షల్ని రాయబోయే విద్యార్థులు తాజా వివరాల కోసం ఐసీఏఐ అధికారిక వెబ్‌సైట్ లో https://icai.org/indexbkp.htmlచూడొచ్చు. ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో పరీక్షలను జులై 29 నుంచి ఆగస్టు 16 వరకు నిర్వహిస్తామని తాజాగా వెల్లడించింది. అన్ని పరీక్షలు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్నాయి. దేశంలోని 207 సెంటర్లలో ఐసీఐఏ సీఏ ఎగ్జామ్ 2020 జరగనుంది.

ఇది కూడా చదవండి:ఫేక్ వార్తలను నమ్మొద్దు అంటున్న విజయ్ దేవరకొండ

పరీక్షల తాజా టైమ్‌ టేబుల్‌:

  • ఫౌండేషన్‌ కోర్సు (కొత్త): ఆగస్టు 7, 9, 11, 14 తేదీల్లో జరుగుతాయి.
  • ఇంటర్మీడియట్‌(ఐపీసీ) కోర్సు (పాత విధానం): గ్రూపు-1 పరీక్షలు: జులై 30, ఆగస్టు 2, 4, 6 తేదీల్లో ఉంటాయి.
  • గ్రూపు-2 పరీక్షలు: ఆగస్టు 8, 10, 13 తేదీల్లో జరుగుతాయి.
  • ఇంటర్మీడియట్‌ కోర్సు పరీక్షలు (కొత్త విధానం): గ్రూపు-1 పరీక్షలు: జులై 30, ఆగస్టు 2, 4, 6
  • గ్రూపు-2 పరీక్షలు: ఆగస్టు 8, 10, 13, 16 తేదీల్లో ఉంటాయి.
  • సీఏ ఫైనల్‌ (పాత, కొత్త విధానం): గ్రూపు-1: జులై 29, 31, ఆగస్టు 3, 5
  • గ్రూపు-2: ఆగస్టు 7, 9, 11, 14 తేదీల్లో ఉంటాయి.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss