Monday, May 10, 2021

Latest Posts

వైద్యులపై దాడులకు పాల్పడితే నాన్‌బెయిలబుల్‌ కేసులు

Cabinet approves ordinance making violence against health

విధి నిర్వహణలో ఉన్న వైద్యసిబ్బందిపై జరుగుతున్న దాడులను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సమయంలో వైద్యులపైన, వైద్యసిబ్బందిపైన దాడులు జరగడాన్ని ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశం ఖండించింది. ఇటువంటి దాడులకు పాల్పడినవారిపై నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేసి గరిష్ఠంగా ఏడేళ్లవరకు జైలు శిక్ష విధించేలా పాత చట్టాన్ని సవరించింది. ఈ మేరకు అంటువ్యాధుల చట్టం-1897కు సవరణలు చేస్తూ తీసుకు వచ్చిన ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది.

వైద్యులపై దాడులకు పాల్పడినవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, కేసు తీవ్రతను బట్టి శిక్ష ఉంటుందని కేబినెట్‌ సమావేశంలోని  వివరాలను మంత్రి ప్రకాశ్‌ జావదేకర్‌ మీడియాకు వివరించారు. దాడుల తీవ్రత తక్కువ ఉంటే ఆరు నెలల నుంచి ఐదేళ్ల జైలు శిక్ష మరియు రూ. 50వేల నుంచి 2లక్షలవరకు జరిమానా విధిస్తారని, దాడి తీవ్రత ఎక్కువగా ఉంటే ఏడేళ్లవరకు జైలు శిక్ష ఉంటుందని, రూ. 2లక్షలనుంచి రూ.5 లక్షలవరకు జరిమానా విధిస్తామని తెలిపారు. అలాగే  హాస్పిటల్ కు సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేస్తే వాటి మార్కెట్‌ విలువ కంటే రెట్టింపు పరిహారాన్ని నిందితుల నుంచి వసూలు చేస్తామన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి కోవింద్‌ బుధవారం అర్ధరాత్రి ఆమోదం తెలిపారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss