Tuesday, January 25, 2022

Latest Posts

స్టీల్ ప్లాంట్ ఉద్యోగాలు ఎప్పుడైనా తొలగిస్తారు – కేంద్రం

Can Terminate Staff At Any Time

స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు తమ ఉద్యోగాలకు కేంద్ర ప్రభుత్వం రక్షణ ఇవ్వాలని కోర్టులో పిటీషన్ వేశారు. అయితే పిటిషన్‌పై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. అఫిడవిట్ ప్రకారం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు వారి ఉద్యోగాలకు కేంద్రం రక్షణ ఇవ్వడం కుదరదని అవసరమైతే వారిని సేవల నుండి తొలగిస్తారని చెప్పడం జరిగింది.

ఆర్‌ఐఎన్‌ఎల్‌లో 100 శాతం పెట్టుబడులు పెట్టడం పై తాము వెనక్కి వెళ్లడం లేదని కేంద్రం స్పష్టం చేసింది మరియు పిటిషన్‌ను కొట్టివేయాలని హైకోర్టును అభ్యర్థించింది. మేము ఇప్పటికే అర్హత కలిగిన ఏజెన్సీల నుండి బిడ్డింగ్లను ఆహ్వానించాము, అని కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ లో పేర్కొంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు ఇది ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తు ఉద్యమాలు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss