Friday, June 25, 2021

Latest Posts

ప్రస్తుత మార్కెట్ లో త్రివిక్రమ్ ఆ రేంజ్ అందుకోగలడా

ఈ సంక్రాంతి సీజన్లో పోటీకి నిలుస్తున్న పెద్ద మూవీస్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురములో‘ మూవీ ఒకటి. గతంలో వీరిద్దరి కాంబోలో జులాయి,సన్నాఫ్ సత్యమూర్తి హిట్ కొట్టడంతో ఇప్పుడు హ్యాట్రిక్ చిత్రం గా వస్తున్న ‘అల వైకుంఠపురములో’ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతూ మూడు నెలల ముందు నుంచి ప్రేక్షకులకు చేరువయ్యే ప్రయత్నం చెయ్యడంతో సినిమాకు మొదటి నుంచీ భారీగా హైప్ క్రియేట్ అయింది. ముఖ్యంగా పాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి సినిమా కంటెంట్ బాగుండి, ప్రేక్షకులకు కనెక్ట్ అయితే సినిమా రేంజ్ భారీగానే ఉంటుంది.

ఒకవేళ అంచనాలు అందుకోలేక చతికిలబడితే బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా వైఫల్యం మూటగట్టుకుంటుంది. గతంలో భారీ అంచనాలతో త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘అజ్ఞాతవాసి’ ఎలాంటి డిజాస్టర్ ఇందుకు ఉదాహరణ. ఇక త్రివిక్రమ్ ట్రాక్ రికార్డు కూడా ఈమధ్య అంత గొప్పగా లేదు. మునుపటి ఫామ్ లో లేడనేది అంతటా విన్పించే మాట. ‘అల వైకుంఠపురములో’ సినిమాకు పాటలు సూపర్ హిట్ అయ్యాయి కానీ టీజర్ కు మిశ్రమ స్పందనే వచ్చింది. బన్నీ స్టైలిష్ గా కనిపించడం తప్ప కొత్తగా ఏమీ లేదని కూడా కొందరు వ్యాఖ్యానించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన ‘అరవింద సమేత’ ఏదో పర్వాలేదనిపించుకుంది.

అయినా ఆ సినిమా అంచనాలను అందుకోలేదు. ముఖ్యంగా ‘పెనిమిటి’ సాంగ్ కు రిలీజ్ అయిన సమయంలో ఆహా ఓహో అన్నారు. ఈ పాటకు తిరుగులేదన్నారు. సాహిత్యం, గానం, సంగీతం అన్నీ సూపర్ కానీ చిత్రీకరణ ఆ పాట లోని ఆత్మను పూర్తిగా దూరం చేసేసింది. పిక్చరైజేషన్ లో దమ్ములేదు. ఆ పాటలోని భావానికి ఆ చిత్రీకరణకు పొసగలేదు. దీంతో చాలామంది ఆడియన్స్ ఖంగుతిన్నారు. ఇలాంటి అంశాలు ‘అరవింద సమేత’లో ఇంకా చాలానే ఉన్నాయి. మరి ‘అల వైకుంఠపురములో’ సినిమా విషయంలో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉంటాయా లేదా, అసలు ప్రస్తుత మార్కెట్ లో త్రివిక్రమ్ నిలబడగాలడా అనేది సినిమా విడుదల తర్వాత తేలనుంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss