cancels CBSC tenth class examinations
దేశ వ్యాప్తంగా జరగాల్సిన సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షల నిర్వహణపై కీలక ప్రకటన చేశారు కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ .కరోనా వైరస్ వ్యాప్తితో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించారు. ఈశాన్య ఢిల్లీ మినహా అన్నీ కేంద్ర విద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న వారికి పెండింగ్లో ఉన్న పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించబోమని చెప్పారు. అయితే ఈశాన్య ఢిల్లీకి చెందిన విద్యార్థులు మాత్రం పరీక్షల రాయాలని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
విద్యార్థులకు మాత్రంపరీక్షలు రాయటానికి రెడీ అవటానికి 10 రోజుల సమయం ఇస్తామని ట్విట్టర్లో ట్వీట్ చేశారు పోఖ్రియాల్. కేంద్రం లాక్డౌన్ను పొడిగించిన నేపథ్యంలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ను పెట్టడానికి లాక్డౌన్ సడలించిన తర్వాత పదో తరగతి పరీక్షల నిర్వహణకు రెండు వారాల సమయం పట్టిది అని, తాజాగా ప్రకటనతో దేశ వ్యాప్తంగా సీబీఎస్ఈ టెన్త్ క్లాస్ పరీక్షలపై ఓ క్లారిటీ వచ్చింది.
📢Attention class X students!
No examination to be held for class X students nationwide, except for students from North-East Delhi.An adequate time of 10 days will be given to all students for the preparation of exams.#EducationMinisterGoesLive pic.twitter.com/xjj7qszUZZ
— Dr Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) May 5, 2020