Thursday, December 2, 2021

Latest Posts

రచయిత అనంత శ్రీరామ్ పై పోలీసులకు ఫిర్యాదు

Case Filed Against Ananta Sriram

టాలీవుడ్‌ పరిశ్రమలో సినిమాల పాటలపై వివాదాలకు కొత్త ఎమి కాదు. తాజాగా దేవుడిని కించపరిచేలా ఒక పాటను రచించారంటూ ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్‌ పై బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగశౌర్య హీరోగా నటిస్తోన్న “వరుడు కావలెను” సినిమాలోని “దిగు దిగు దిగు నాగ” పాటలో నాగదేవతను కించపరిచేలా ఉందని, అందువల్ల పాట రచించిన అనంత శ్రీరామ్‌ పై అలాగే సినిమా బృందంపై తగిన చెర్యలు తెసుకోవాలని నెల్లూరుజిల్లా చిల్లకూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పాట థమన్ సంగీతం సరద్యంలో అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని సమకూర్చగా ప్రముఖ హిందీ సింగర్ శ్రేయా ఘోషల్ పాడారు. అనంతర శ్రీరామ్‌ రచన చేసిన ఆ పాట హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు బిందూరెడ్డి అన్నారు. కాగా సినిమాను లక్ష్మి సౌజన్య దర్శకత్వం సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందించారు.

ఇది కూడా చదవండి:   

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss