Thursday, December 2, 2021

Latest Posts

దాసరి నారాయణరావు తనయుల పై కేసు

Case Filed Against Dasari Narayana Rao Sons

దర్శకరత్న దాసరి నారాయణరావు తనయుల పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు తెలుస్తుంది. దాసరి పోయినప్పటి నుంచి కూడా ఈయన కుటుంబం అప్పుడప్పుడూ వార్తల్లో ఉంటూనే వస్తుంది. తాజాగా మరోసారి దాసరి కుటుంబం వార్తల్లో నిలిచింది. దాసరి నారాయణరావు కొడుకులు దాసరి అరుణ్ కుమార్, ప్రభులపై కేసు నమోదవ్వడం చర్చనీయాంశం అయింది. అప్పుతీర్చమని కోరినందుకు చంపేస్తామంటూ బెదిరించారని వారిపై కేసు నమోదైనట్లు తెలుస్తున్నది. వివరాల్లోకి వెళ్తే దాసరి బతికున్న రోజుల్లో ఆయన అత్యంత సన్నిహితుల్లో ఒకరైన గుంటూరు జిల్లా ఎల్లారెడ్డి గూడ నివాసముంటున్న సోమశేఖర్ రావు అట్లూరి నుంచి 2.10 కోట్లు అప్పుగా తీసుకున్నారు.

అయితే ఆయన అప్పు తీర్చకుండానే 2017లో దాసరి కన్నుమూయడంతో పెద్దల సమక్షంలో ఈ సమస్యను ఉంచారు సోమశేఖర్ రావు. దీనిపై 2018 నవంబర్ 13న దాసరి కొడుకులను కూడా కూర్చోబెట్టి 2.10 కోట్లుబదులు 1.15 కోట్లు ఇప్పించడానికి పెద్దలు నిర్ణయించారని, అయితే ఇది జరిగి రెండేళ్ళవుతున్నా కూడా తన డబ్బు ఇంకా ఇవ్వక పోవడంతో జూబ్లీహిల్స్ రోడ్ నెం 46 లోని దాసరి కుమారుల ఇంటికి వెళ్ళిఅడుగగా సోమశేఖర్ రావును దాసరి తనయులు భయపెట్టారని ఇంకోసారి డబ్బు కోసం మా ఇంటికి వస్తే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారంటూ పోలీసు స్టేషన్లో దాసరి అరుణ్ కుమార్, ప్రభులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss