Thursday, December 2, 2021

Latest Posts

మలయాళ స్టార్ నటుడు మమ్ముట్టి పై కేసు నమోదు

Case Filed Against Mammootty And 300 Others

మలయాళ స్టార్ నటుడు మమ్ముట్టి పై కోజికోడ్‌లోని ఎలత్తూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. కోజికోడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఈవెంట్‌కు హాజరైనప్పుడు కోవిడ్ -19 ప్రోటోకాల్‌లను ఉల్లంఘించినందుకు ఈ కేసును నమోదు చేశారు. మమ్ముట్టి తో పాటు, రమేష్ పిషారడీ మరియు 300 మంది పై కేరళ ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 2021 సెక్షన్ 4, 5, మరియు 6 కింద కేసును నమోదు చేశారు.

పూర్తి వివరాల ప్రకారం, ఈ స్టార్ హీరో ఆగస్టు 3న ఆసుపత్రిలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆసుపత్రి వెలుపల 300 మందితో గుమి గూడి మాట్లాడటం జరిగింది. దీనితో వీరి పై కోజికోడ్‌లోని ఎలత్తూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదయ్యింది. ఫిర్యాదు అందుకున్న తరువాత, కోజికోడ్ ఎలత్తూర్ స్టేషన్ పోలీసులు హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌తో పాటు నటులు మమ్ముట్టి, రమేష్ పిషారొడీ మరియు ఇతరులపై దర్యాప్తు ప్రారంభించారు. ఇక మమ్ముట్టి తాజాగా వన్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చారు.

ఇది కూడా చదవండి:   

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss