Wednesday, January 20, 2021

Latest Posts

కఠిన శిక్షలు తప్పవు

Cases will be raised and strict punishments will be instituted

కొన్ని కొన్ని పత్రికలు మరియు సోషల్ మీడియాలో కొంతమంది బాధ్యతారాహిత్యంగా, ఇలాంటి సమయాలలో వార్తలను రాస్తున్నారని వారి మీద కేసులు పెడతామని మరియు కఠినంగా శిక్షలు విధిస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. మొన్న ఒక పత్రికలో “వైద్యులకు రక్షణ ఏది” అని రాశాడు,  వైద్య సిబ్బందికి రక్షణ ఆ పత్రిక ఆయన వచ్చి ఇస్తాడ అని మరో పత్రిక వారు పి‌పిఈ కిట్లు లేవని రాశాడు. రాష్ట్రంలో 80వేల పిపిఈ  కిట్లు ఉన్నాయి.  అలా రాసిన వారికి బుద్ధి జ్ఞానం ఉండాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచురించి ప్రభుత్వాన్ని ఇరుకున  పడేస్తున్నారు చేతనైతే రెండు మంచి వార్తలు రాయాలి లేకపోతే ఇంట్లో పడుకో అని హెచ్చరించారు.

ఐదు లక్షల పి‌పిఈ కిట్లు మరియు లక్షల మాస్కు లకు ఆర్డర్ చేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఇలాంటి తప్పుడు రాతలు రాసే వారికి కరోనా తగలాలని ఇది నా శాపం అని కెసిఆర్ వ్యాఖ్యానించారు.  ప్రతిదీ రికార్డ్ గా ఉంది ఇలా తప్పుడు రాతలు రాసే వారిపై  సరైన సమయంలో లో పనిష్మెంట్ ఇస్తామని, కఠిన శిక్షలు విధిస్తామని హెచ్చరించారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss