Thursday, December 2, 2021

Latest Posts

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడుని అరెస్ట్ చేసిన సి‌బి‌ఐ

CBI Arrest Main Accused In YS Vivekananda Reddy Murder Case

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు అయిన సునీల్ యాదవ్‌ను సి‌బి‌ఐ అధికారులు గోవాలో అరెస్టు చేశారు. ప్రస్తుత సమాచారం ప్రకారం, సి‌బి‌ఐ అధికారులు సునీల్ యాదవ్‌ను అదుపులోకి తీసుకుని స్థానిక కోర్టులో హాజరుపరిచారు. ఆ తరువాత, అతడిని ట్రాన్సిట్ వారెంట్‌పై ఏ‌పి‌కి తరలించనున్నారు. ఇక సి‌బి‌ఐ అతడిని బుధవారం కడప కోర్టులో హాజరుపరుస్తుంది.

హైకోర్టు ఆదేశాల మేరకు సిట్ నుంచి సిబిఐ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ కేసు పై దర్యాప్తు వేగవంతమైంది. తాజాగా, ఇప్పుడు నిందితుదిని అరెస్ట్ చేశారు. వివేకానంద రెడ్డి హత్య జరిగి రెండు సంవత్సరాలు అయినా నిందుతుడిని పట్టుకోవడంలో పోలీసులు విఫలం కావడంతో కేసును సి‌బి‌ఐ కి అప్పగించింది కోర్టు. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ ప్రధాన నిందితుడిగా సునీల్ యాదవ్ ను పట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి:  

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss