Wednesday, April 21, 2021

Latest Posts

ఫెయిలైన విద్యార్థులకు మళ్లీ పరీక్షలు

ఈ మహమ్మారి  కరోనా రక్కసి  కారణంగా ఇప్పటికే చాలా వరకు  పలు రాష్ట్ర ప్రభుత్వాలు 9, 11వ తరగతి  విద్యార్ధులను ఇంతకు  ముందు  జరిగిన పరీక్షల ఫలితాలు ఆధారంగా పైతరగతులకు ప్రమోట్ చేసిన సంగతి తెలిసినదే.అయితే ముందు జరిగిన ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి.? అయితే  ఈ ప్రశ్నకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) బోర్డు సమాధానం ఇచ్ఛిన్నట్లు తెలిపారు.పాఠశాల స్థాయిలో  జరిగిన  పరీక్షలలో  9, 11వ తరగతిల్లో ఫెయిలైన విద్యార్ధులకు మళ్లీ పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్‌ఈ వెల్లడించింది.

కానీ  ఏ స్కూల్‌లో చదువుతున్న విద్యార్ధులకు ఆ స్కూల్ మాత్రమే ఆన్లైన్/ ఆఫ్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాలని, అంతేకాకుండా విద్యార్ధులు పరీక్షలకు సిద్దం  కావడానికి కొంత సమయం ఇవ్వాలని సీబీఎస్‌ ఆ స్కూళ్లను కోరింది. కాబట్టి  ఈ పరీక్షలలోని ఫలితాలు ఆధారంగా నే విధ్యార్ధులను పై తరగతులకు ప్రమోట్ చేయవచ్చునని పాఠశాల యాజమాన్యాలకు సీబీఎస్‌ఈ తెలిపింది.

ఇది కూడా చదవండి: మళ్లీ కేసుల సంఖ్య పెరగడానికి కారణం ఏమిటో

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss