CBSE cancels Pending tenth Class Examinations
లాక్ డౌన్ వల్ల ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులకు పరీక్షలు రద్దు చేసి అందరినీ పై తరగతులకు ప్రమోట్ చేస్తూ సిబిఎస్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అలాగే 9, 11వ తరగతుల విద్యార్థులు వారి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ఆయా పాఠశాలల ప్రిన్సిపల్స్ వారిని ప్రమోట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి రమేష్ నిషికాంత్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు పెండింగ్ లో ఉన్న పదవ తరగతి పరీక్షలన్నింటిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
వాస్తవానికి దేశంలో సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు మార్చి 18న పూర్తి అవ్వాలి. కానీ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో సిఏఏకు వ్యతిరేకంగా నిరసనలు జరగడంతో కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. వాయిదా వేసిన పరీక్షలు మార్చి 18వ తేదీ తర్వాత నిర్వహించాలని సీబీఎస్ఈ బోర్డు అనుకున్నప్పటికి అప్పటికే దేశంలో కరోనా కేసులు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను అమలులోకి తెచ్చింది. దీంతో ఆ పరీక్షలు తో పాటు దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ పన్నెండో తరగతి పరీక్షలు కూడా కొన్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పెండింగ్ లో ఉన్న టెన్త్ పరీక్షలు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే రద్దెన పరీక్షలకు సంబంధించి ఫలితాలు ఏ విధంగా ప్రకటిస్తారని సీబీఎస్ఈ నిర్ణయించాల్సి ఉంది. సీబీఎస్ఈ పన్నెండో తరగతి పరీక్షలను కూడా రద్దు చేస్తారని కొన్ని ప్రచార మాధ్యమాలలో వస్తున్న వార్తలు అసత్యమని, ఈ పరీక్షలు పూర్తిగా రద్దు చేసే అవకాశం లేదని సీ.బీ.ఎస్.ఈ అనురాగ్ త్రిపాటి చెప్పారు.