CDC warning that corona will be severe by the end of the year
కరోనా మహమ్మారి వల్ల ప్రపంచదేశాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. ఇప్పటికే చాలా దేశాల్లో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ వైరస్ వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కూడా లేకపోవడంతో ఎలా అడ్డుకట్టవేయాలని దేశాధినేతల తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రజలు భయాందోళనల మధ్య బతుకుతున్నారు. కాగా సెంటర్స్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్సన్ డైరక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ అంచనా ప్రకారం ఈ ఏడాది చివరలో ఈ మహమ్మారి తీవ్రంగా విరుచుకుపడే అవకాశముందట.
దానికి కారణం అమెరికాలో రానున్న శీతాకాలంలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉండనుందని ఆయన తెలిపారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ మాట్లాడుతూ ఈ ఏడాదిలో అమెరికాలో ఒకవైపు ఫ్లూ మరోవైపు కరోనా వైరస్లు విజృంభిస్తాయని, తొలిదశలో కరోనా వైరస్ వ్యాప్తికి ఫ్లూ తోడై ఉంటే పరిస్థితి తట్టుకోవడం కష్టమయ్యేదని అదృష్టవశాత్తు ఫ్లూ తగ్గుముఖం పడుతున్న సమయంలో కరోనా వచ్చిందని ఆయన అన్నారు. ఇప్పటికే అమెరికాలో దాదాపు 8.52లక్షల మంది కరోనా వైరస్ బారిన పడగా, 47 వేలకు పైగా మరణించారు.