Central government announced New guidelines against sanitizer
కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వాలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాగే ప్రజలు కూడా వారికి అనుగుణంగా ప్రభుత్వం సూచన మేరకు వారి వంతు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కేంద్రం ప్రకటించిన లాక్డౌన్ నిబంధనలు కూడా ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు పాటిస్తూనే కరోనా నివారణ చర్యలు తీసుకుంటున్నారు. వాటిలో భాగంగా పరిసరాల్లో రసాయనాలు, పొడులు, పురుగు మందులు, స్ప్రేలను చల్లుకుంటూ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ కొన్ని చోట్ల మరీ అతిజాగ్రత్తతో మనుషులపైన కూడా శానిటైజర్లు జల్లు తున్నారు. అటువంటి వారికి కేంద్రం హెచ్చరికలు జారీచేసింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇకపై వ్యక్తులపై లేదా గ్రూపులపై రసాయనాలు, శానిటైజర్లు జల్లకూడదని కేంద్రం స్పష్టం చేసింది.
వ్యాది సోకిన వారిపై రసాయనాలు చల్లడం వల్ల ఉపయోగం లేదనీ, శరీరంలోపల ఉన్న కరోనా బయట స్ప్రేలు జల్లుతై ఎలా నాశిస్తుందని కేంద్రం ప్రశ్నిస్తోంది. ఇలాంటి స్ప్రేల చేయ్డమ్ వల్ల కరోనా చనిపోతుందనేందుకు ఆధారాలు ఇక్కడ లేవని చెప్పింది. స్ప్రేలు చల్లితే కళ్లు, చర్మం పాడవుతాయనీ, గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఎఫెక్ట్స్ ఏర్పడతాయనీ, వికారం, వాంతుల వంటివి వస్తాయని ఇంకా ఇలాంటి అనేకానేక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ రసాయనాలను ఇళ్లలో తలుపులు, కిటికీలు, ఫ్లోర్లను క్లీన్ చేయడానికి వాడాలి గానీ మనుషులపై జల్ల కూడదని, అంతే కాదు వీటిని ఉపయోగించే తప్పుడు చేతులకు గ్లోవ్స్ మరియు కాళ్లకు షు ధరించాలి అని సూచించింది. కరోనా వ్యాప్తి అరికట్టాలి అంటే ఎప్పటికప్పుడు చేతుల్ని సబ్బుతో శుభ్రంగా కడుక్కొని, సామాజిక దూరం పాటించాలని కేంద్రం సూచించింది.