Monday, May 10, 2021

Latest Posts

కేంద్ర మార్గదర్శకాలు ఇవే

central Government announced new lockdown guidelines

లాక్‌డౌన్ ను మే 3 వరకు పొడిగించినట్లు ప్రధాని శ్రీ నరేంధ్ర మోది గారు  మంగళవారం తెలిపారు. దానిలో భాగంగా కేంద్రం కొన్ని  మార్గదర్శకాలను కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇవాళ విడుదల చేసింది. మార్గ దర్శకాలలో ఇప్పటికే కొన్ని అమలులో ఉన్నాయి మి గిలినవి ఏప్రిల్ 20 నుండి అమలు చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వం ఉతర్వులు జారీచేసింది.

అన్ని జాతీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల సర్వీసులు మరియు బస్సు, రైలు మెట్రో సర్వీసులు మే 3 వరకు నిలిపివేయనున్నట్టు తెలిపింది. అత్యవసర వైద్యానికి మినహా అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా ప్రయాణాలు నిషేధించింది ఎక్కడ వారు అక్కడే ఉండాలని స్పష్టం చేసింది. ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు 20 మందికి మించి హాజరుకాకూడదని పేర్కొంది. నిత్యావసరాల పంపిణీ మినహా మిగతా అన్ని కార్యక్రమాలకు రద్దుచేసింది. మాల్స్, థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, జిమ్స్, స్పోర్ట్ కాంప్లెక్స్‌లు, బార్స్, ఆడిటోరియంలు  లోక్ డౌన్ ను కొనసాగించాలి అని తెలిపారు.

సామాజిక, రాజకీయ, క్రీడా, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై నిషేధం, మతప్రదేశాలలో ప్రార్థనలన చేయకూడదని, అలాగే  హాట్‌స్పాట్స్, కంటెయిన్‌మెంట్ జోన్‌లలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆరోగ్య శాఖ గతంలో సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి అని స్పష్టం చేసింది. హాట్‌స్పాట్స్‌, కంటెయిన్‌మెంట్ జోన్‌లను రాష్ట్ర, కేంద్రపాలిత ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు గుర్తించాలి. ఈ ప్రదేశాలలో సాధారణ కార్యకలాపాలకు అనుమతిలేదని తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జరిమానా విధిస్తామని పేర్కొంది.భవన కార్మికులు మాస్క్‌లు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ నిర్మాణ పనులను చేసుకోవచ్చని తెలిపారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి కాకుండా ఎక్కడ ఉన్న వారు అక్కడే పనులు చేపట్టాలని తెలిపింది. గ్రామాలలో రహదారులు, సాగునీటి, పారిశ్రామిక ప్రాజెక్టు నిర్మాణ పనులకు చేసుకోవచ్చు.

 ఆరోగ్య కేంద్రం, ఔషధాల విక్రయాలు, ఔషధ పరిశ్రమలలో ఉత్పత్తికి, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వరంలోని వ్యవసాయ మార్కెటింగ్ కార్యకలాపాలు,  వ్యవసాయ పరికరాలను అద్దెకు ఇచ్చే పరిశ్రమలకు, ఎరువులు, పరుగుల మందులు, విత్తనోత్పత్తి దుకాణాలు ఆక్వా ఉత్పత్తుల క్రయ విక్రయాలకు, బ్యాంకు కార్యకలాపాలకు అనుమతి లబించింది. పాలకు సంబంధించిన వ్యాపారాలు, పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ పరిశ్రమ, టీ, కాఫీ, రబ్బరు సాగును యదావిడిగా కొనసాగించవచ్చు తెలిపింది.  అలాగే, వృద్ధాశ్రమాలు, అనాథశరణాలయాలు నిర్వహణకు ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss