central government rejected CM Uddhav Thackeray Appeal
కరోనా మహమ్మారితో దేశంలో లాక్ డౌన్ ప్రకటించడం,దాన్ని పొడిగించడం నేపథ్యంలో ఎక్కడివాళ్ళు అక్కడే ఆగిపోయారు. ముఖ్యంగా వలస కార్మికులు పెద్ద ఎత్తున్న ఆయా రాష్ట్రాల్లో ఉండిపోయారు. అయితే వీళ్ళు తమ తమ ఊళ్లు వెళ్లిపోతామని గగ్గోలు పెడుతుంటే కుదరదని ప్రభుత్వం అంటోంది. అయితే మహారాష్ట్రలో ఉన్న వలస కార్మికులను తిరిగి స్వస్థలాలకు పంపేందుకు రైళ్లు నడపాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రే విజ్ఞప్తి చేసారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది.
సీఎం వినతిని తిరస్కరించినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దేశంలో మరోసారి నిజాముద్దీన్ తరహా పరిస్థితి తలెత్తకూడదనే ఉద్దేశంతోనే మహారాష్ట్ర నుంచి రైళ్లను నడిపేందుకు సిద్ధంగా లేనట్లు ఆయన వెల్లడించారు. వలస కార్మికుల పరిస్థితిని, వారి మనోభావాలను తాను అర్థం చేసుకోగలనని.. కానీ ఎటువంటి ముందు జాగ్రత్తలు లేకుండా వారిని స్వస్థలాలకు పంపించలేమని ఆయన చెప్పారు.
కాగా మహారాష్ట్రలో 6 లక్షల మంది వలస కార్మికులు షెల్టర్లలో ఉన్నారని, వారికి భోజనం, వైద్యసౌకర్యాలు కల్పిస్తున్నట్లు సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎక్కువ మంది వలస కార్మికులు తమ కుటుంబాలకు దూరంగా మహారాష్ట్రలో ఉన్నారని వారిని వారి కుటుంబాల వద్దకు చేర్చాలని సీఎం కేంద్రాన్ని కోరారు. ఏప్రిల్ 30 నుంచి మే 15వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లను నడపాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. ఈ వినతిని కేంద్రం తిరస్కరించింది.