Thursday, May 13, 2021

Latest Posts

రెడ్‌ జోన్లలోనూ మద్యం అమ్మకాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

central Govt green signal to liquor sale in red zones

మందు బాబులకు శుభవార్త చెప్పిన కేంద్రం. మరో రెండు వారాలు లాక్ డౌన్ ను కొన్ని సడలిపులతో మరో మారు కేంద్రం  పొడిగించింది. రెండవ సారి పొడిగించిన లాక్ డౌన్ ఈ నెల 3తో ముగుస్తుంది. అప్పటి నుండి మరో రెండు వారాలు లాక్ డౌన్ పొడిగించింది. మూడో విడత లాక్ డౌన్ లో మినహాయింపులపై కేంద్రం మరింత స్పష్టతనిచ్చింది. మొన్న తెలిపిన సడలింపులలో కరోనా కంటైన్‌మెంట్‌ ఏరియాలు గ్రీన్, ఆరెంజ్‌ జోన్లలో మాత్రమే మద్యం అమ్మకాలకు అనుమతి నిచ్చింది.

తాజాగా వాటితో పాటు రెడ్‌ జోన్లలోనూ మద్యం అమ్మకాలు జరుపుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వాలకు   తెలిపింది.అయితే, ఇందుకు కొన్ని పరిమితులు విధించింది. మద్యం మాత్రమే విక్రయించే దుకాణాలు అయి ఉండాలని బార్లకు అనుమతి లేదని తెలిపింది. విక్రయాల సమయంలో దుకాణం వద్ద కొనుగోలు దారులు భౌతిక దూరం పాటించే విధంగా చర్యాలు తీసుకోవాలని సూచించింది. అలాగే వైన్ షాప్ ల వద్ద అయిదుగురికి మించి ఉండకూడదని స్పష్టత ఇచ్చింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss