Thursday, December 2, 2021

Latest Posts

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పాత పాటే పాడిన కేంద్రం

Centre clarifies on privatisation of Vizag steel plant

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేదే లేదంటు పాత మాటే చెప్పింది కేంద్రం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగి తీరుతుందని తేల్చి చెప్పింది. వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ఎంపీలు సజ్దా అహ్మద్‌ సహా మరో ఇద్దరు ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్రం ఇప్పటికే దానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభంమైందని పేర్కొంటు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది.  ప్రసుత్తం ఫ్యాక్టరీలో పని చేస్తున్న ఉద్యోగులు, భాగస్వాముల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపింది. కాగా మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తు పెద్దఎత్తున ఉద్యమాలు జరుగుతున్నా సంగతి తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ ఢిల్లీలో ధర్నా కూడా చేపట్టగా ఆ ఈ ధర్నాకు వైసీపీ ఎంపీలు కూడా మద్దతు పలికి విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేసే నిర్ణయం పట్ల కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని నినాదాలు చేశారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss