చంద్రబాబు మోడీకే కాకుండా జగన్ కు సలహాలు ఇవ్వొచ్చు, మంచి బుద్ధితో సలహా ఇస్తే తీసుకునేందుకు ముఖ్యమంత్రి వెనుకాడరని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కరోనా వల్ల అసలే ఆర్థిక ఇబ్బందుల నుండి కోలుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే చంద్రబాబు వీడియో కాల్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు అని సజ్జలఎద్దేవా చేశారు. ఒక దశలో టెస్ట్ లు చేయడం లేదని, టెస్ట్ లు చేస్తుంటే కేసులు దాచిపెడుతున్నారు అని చంద్రబాబు కావాలనే ప్రభుత్వం పై బురదజల్లుతున్నారని కోయంబెడ్, వలస కూలీలు కేసులు వచ్చినా మేము దాచి పెట్టలేదు అని స్పస్టం చేశారు.
జాతీయ మీడియా ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ఇప్పుడు మాట్లాడుతుంది మరి గోదావరి పుష్కరాలలో 30మందిని చనిపోయినపుడు జాతీయ మీడియా ఏమి మాట్లాడలేదు. దాంతోనే అర్దమవుతుంది చంద్రబాబు మీడియా మేనేజ్మెంట్ ఏవిధంగా చేస్తారు అనే సంగతి. అలాగే పోతిరెడ్డిపాడు విషయంలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఎద్దేవా చేస్తున్నారు. విద్యుత్ బిల్లుల విషయంలో కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
ఇది చదవండి: