Monday, April 19, 2021

Latest Posts

చంద్రబాబు జోలె పడితే ఎంతొచ్చిందో తెలుసా

రాజకీయాల్లో ఆరితేరిన చంద్రబాబు  40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెబుతారు. ఇక మూడుసార్లు సీఎం గా అంటే  15 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు రాజధాని వ్యవహారంలో జె ఏసీ తో కల్సి ఉద్యమానికి దిగారు. అమరావతి రక్షణ కోసం అంటూ  స్వయంగా  జోలె పట్టారు.   అమరావతి పరిరక్షణ సమితి పేరిట చంద్రబాబు జోలెపట్టి రాష్ట్రమంతటా తిరుగుతూ విరాళాలు సేకరిస్తున్నారు. రాజధానిని నిలుపుదల చేసుకునేందుకు ఉద్యమ ఖర్చుల కోసం చంద్రబాబు  ఇలా విరాళాలు సేకరిస్తున్నారు.

చంద్రబాబు తలపెట్టిన ఈ కార్యక్రమానికి ముందుగా ఆయన  భార్య భువనేశ్వరి  తన రెండు బంగారు గాజులు ఇచ్చి ఈ ఉద్యమానికి విరాళాల కు శ్రీకారం చుట్టారు.  చంద్రబాబు లక్ష విరాళంగా అందజేశారు. టీడీపీ నేతలు పారిశ్రామికవేత్తలు బాబు సామాజికవర్గం వారు ఎక్కువగా విరాళాలు అందజేశారు.

జోలె పట్టే కార్యక్రమంలో  ఇప్పటికే మచిలీపట్నం రాజమండ్రి తిరుపతిలో చంద్రబాబు విరాళాలు సేకరించారు. దీంతో ఎంతవచ్చిందో తెలిస్తే గుండె గుభేల్ మంటుంది. అవును  ఏకంగా రూ.57 కోట్లు విరాళాల రూపంలో సేకరించానని చంద్రబాబు తెలిపారు. ఇలా ఆఫ్ లైన్లోనే కాదు.. ఆన్ లైన్లో కూడా విరాళాలు ఇవ్వవచ్చని బాబుగారు ఒక బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా ఇచ్చారు. ఇ న్ని కోట్లు వచ్చిపడడం తో సహజంగానే చర్చకు దారితీసింది. ఏమైనా బాబుగారు రూటే వేరు అంటున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss