Friday, January 22, 2021

Latest Posts

వినూత్న రీతిలో టీడీపీ మహానాడు

టెక్నాలజీని వాడుకోవడంలో టీడీపీ అధినేత చంద్రబాబు దిట్ట.  లాక్‌డౌన్‌ కారణంగా ఆయన హైదరాబాద్‌లో ఉండిపోయినా ప్రతి రోజు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువగానే ఉంటున్నారు. రోజువారీ చర్చల నుంచి కీలక సమావేశాల వరకూ వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారానో లేక మెసేజ్ రూపంలోనో ఆయన తన సందేశాన్ని ప్రజలకు తెలియజేస్తూనే ఉన్నారు. ఇటు కాన్ఫరెన్స్‌ల ద్వారాపొలిట్‌ బ్యూరో సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు.

అయితే గత ఏడాది మినహా ప్రతి సంవత్సరం మే నెలలో 27, 28, 29 తేదీల్లో మహానాడు జరుపుతు వస్తున్నారు. కానీ ఇప్పుడు లాక్ డౌన్ మరియు కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా మహానాడును కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని నిర్ణయించారు చంద్రబాబు. ప్రస్తుత పరిస్థితుల్లో బహిరంగ సభ ద్వారా మహానాడు నిర్వహణ అసాధ్యం కాబట్టి జూమ్‌యాప్‌తో గరిష్టంగా రెండు రాష్ట్రాల్లో 10 వేల మందితో మహానాడుకు ప్లాన్‌ చేస్తున్నారు. దీంతో మూడు రోజుల పాటు ఆన్‌లైన్‌లో మహానాడు నిర్వహించేందుకు సమాయత్తం అవుతోంది టీడీపీ. ఒకవేళ 10 వేల మందితో గనక ఆన్‌లైన్‌లో మహానాడు జరిగితే కొత్త రికార్డ్‌ అవుతుందంటున్నారు తెలుగు తమ్ముళ్లు.

ఇది కూడా చదవండి: దొరికిన చిరుత జాడ | గన్ పహాడ్ లో మరో లారీ డ్రైవర్ పై దాడి

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss