Tuesday, April 13, 2021

Latest Posts

జగన్ సర్కార్ పై విరుచుకు పడ్డ టి.డి.పి అధినేత చంద్రబాబు

Chandrababu Naidu fires on YS jagan government

ఏపీలో రాజకీయలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి జగన్, వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిలపై ఒక లెవెల్ లో విరుచుకు పడ్డారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. కరోనాను నియంత్రించడంలోను, వ్యవసాయ దారులను ఆదుకోవడంలోను జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయినట్లు తెలుస్తుందని విలేకర్లతో ఏర్పాటు చేసిన వీడియో  కన్ఫరెన్స్ లో చంద్రబాబు అన్నారు. కరోనాపై వారు చేస్తున్న ప్రచారం, అక్కడ జరుగుతున్నదంతా అసత్యమేనని, అలాగే వ్యవసాయరంగంపై కూడా అంతా నిర్లక్ష్యమేనని చంద్రబాబు వై సి పి నాయకులపై మండిపడ్డారు.

దేశం లోని ఇతర రాష్ట్రాలు మెరుగైన ప్యాకేజీలు ఇస్తుంటే ఏపీలో మాత్రం నామమాత్రపు సరుకులతో సరిపెట్టడం సరికాదన్నారు. ఇతర రాష్ట్రాలను చూసైనా ఆకలితో బాధపడుతున్న వారికి సాయం చేయట్లేదని కరోనాపై శ్రద్ధపెట్టిన రాష్ట్రాలే అక్కడ వ్యాధిని నియంత్రించగలిగాయని అన్నారు.  అలాగే  ర్యాపిడ్ కిట్ల కొనుగోలు వ్యవహారం చూశాక మీ నిజస్వరూపం, మీ వైఖరి బయటపడ్డాయని తెలిపారు.  మొదటి లాక్‌డౌన్ సందర్భంగా ప్రజలను ఆర్ధికంగా ఆదుకోవడానికి 5 వేలు డిమాండ్ చేశాం కానీ లాక్‌డౌన్ ఇప్పటికీ  కొనసాగుతుంది కాబట్టి ఇప్పుడు కనీసం 7500 నుంచి 10,000 ఐనా ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వై .సి.పి ప్రభుత్వమ్ మొదటి నుంచి చాలా తప్పులు చేస్తుంది  అలాగే వాటిని  ఎవరైనా వాటిగురించి మాట్లాడితే ఎదురుదాడే పనిగా పెట్టుకున్నారు.  ఏ2 ఐన విజయ సాయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అతనొక  ఊరకుక్క మాదిరి వ్యవహరించే అధికారం ఎవరిచ్చారు.  రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన సమయమని ఇప్పటికైనా అతను గ్రహించాలి. ఇప్పటికైనా దాపరికాలు సరికాదు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రైతుల్ని ఆదుకుంటామనే ప్రకటనలు తప్ప ఆచరణలో ప్రభుత్వం విఫలమైంది. పలుచోట్ల రైతులు పండించిన ఉత్పత్తులకు గిట్టుబాటు లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు, తప్పుని ఎవ్వరు ఎత్తి చూపినా వారిపై ఎదురు దాడులు చేస్తున్నారు దక్షిణ కొరియా నుంచి వచ్చిన కిట్లపై అందరూ నిలదీస్తే ఇప్పుడు ధర తగ్గిస్తామంటున్నారు. పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే విధంగా ప్రవర్తించటం ఎంత వరకు న్యాయం. క్లిష్ట సమయంలో కిట్లలో కూడా ముడుపుల కోసం కక్కుర్తిపడ్డారు. జరుగుతున్న పరిణామాలపై ప్రశ్నిస్తే కేసులు పెడతామంటారా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 జిల్లాలు రెడ్ జోన్‌లో ఉన్నాయి.. కర్నూలు జిల్లాలో వైద్యం చేసే వారిపట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?  కర్నూల్ ని స్మశానంగా మారుస్తుంటే ఎవ్వరూ ప్రశ్నించకూడదా అలాగే కన్నా, పవన్ కళ్యాణ్ ఏదైనా మాట్లాడితే వారిపైనా విరుచుకుపడుతున్నారు అంటూ వారిపై మండిపడ్డారు చంద్రబాబు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss