Wednesday, April 21, 2021

Latest Posts

జగన్ కి చంద్రన్న సూచనలతో లేఖ

Chandrababu Naidu Letter to CM YS Jagan over Coronavirus:

ఎప్పుడూ ఎపి సీఎం జగన్ పై అగ్గిమీద గుగ్గిలం అయ్యే టిడిపి నేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇప్పుడు హిత వచనాలతో సూచనలతో ఓ లేఖ రాసారు. కరోనా నియంత్రణపై రాసిన ఈ లేఖలో కరోనాతో ప్రపంచ దేశాలన్నీ తల్లడిల్లుతున్నాయని, కేవలం లాక్‌డౌన్‌తో ఆశించిన ప్రయోజనాలు నెరవేరవని పేర్కొన్నారు.
ప్రజారోగ్య చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే విదేశాల నుంచి ఏపీలోకి 15వేల మంది వచ్చినట్లు పక్కా సమాచారం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. వారందరికీ కట్టుదిట్టంగా క్వారంటైన్‌ అమలు చేయాలన్నారు. కరోనా సోకినవారి కోసం ప్రత్యేక ఆస్పత్రి ఏర్పాటు చేయాలని సూచించారు.

గ్రామాలు, వార్డుల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని చంద్రబాబు కోరారు. ప్రతి పేద కుటుంబానికి 2నెలలకు సరిపడా నిత్యావసరాలు ఇవ్వాలని, ప్రతి పేద కుటుంబానికి రూ.5వేలు తక్షణ సాయంగా ఇవ్వాలని, మార్కెట్‌లో నిత్యావసర ధరలను కట్టడి చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss