Thursday, January 21, 2021

Latest Posts

జగన్ తీరు శోచనీయం – కరోనా లెక్కలు చెప్పిన చంద్రబాబు

Chandrababu Naidu slams Andhra CM Jagan Mohan Reddy:

ఇరాన్‌లో మొదటి వారంలో కేవలం రెండు కేసులే నమోదయ్యాయి. నాలుగో వారానికి 4,700, ఐదో వారానికి 12 వేల కేసులు నమోదయ్యాయి. ఇటలీలో మొదటి వారంలో 3 కేసులు నమోదైతే ఐదో వారానికి 21 వేల కేసులు అయ్యాయి. దీనిని తీవ్రంగా తీసుకోకుండా ఫ్రాన్స్‌లో ఎన్నికలు పెట్టారు. ఆ ఒక్క రోజే ఆ దేశంలో 900 కేసులు నమోదయ్యాయి. ఇరవై మంది చనిపోయారు. గతంతో పోలిస్తే ఓటింగ్‌ ఇరవై శాతం తగ్గింది. 45 శాతం పోలింగ్‌ మాత్రమే జరిగింది. ఇప్పుడీ వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ఆ దేశం నానా తంటాలు పడుతోంది. అంతెందుకు, వచ్చే నెలలో జరగాల్సిన స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం నిర్ణయించింది’అని మాజీ ముఖ్యమంత్రి ,టిడిపి అధినేత చంద్రబాబు చెప్పుకొచ్చారు.

ఇక దేశమంతా కరోనా వైరస్‌ వ్యాప్తిపై ఆందోళనకు గురవుతుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మాత్రం ఎన్నికలు ఆగిపోయాయన్న టెన్షన్‌తో నలిగిపోతున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్యలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా వైర్‌సపై తన వ్యాఖ్యలతో జగన్‌ దేశవ్యాప్తంగా నవ్వుల పాలయ్యారని, ఇప్పటికైనా తప్పు దిద్దుకోవాల్సింది పోయి మూర్ఖుల మాదిరిగా ఎదురుదాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు.

కక్షిదారులతో ముఖాముఖి విచారణలు నిలిపివేసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాత్రమే విచారణలు నిర్వహించాలని సుప్రీంకోర్టు.. వారంలో మూడు రోజులే పనిచేయాలని తెలంగాణ హైకోర్టు.. 15 రోజులపాటు అత్యవసర కేసులు మాత్రమే తీసుకోవాలని మన హైకోర్టు నిర్ణయించాయి. వీళ్లంతా తెలివి లేక ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా? కరోనా పెద్ద సమస్య కాదని.. పారసిటమల్‌ సరిపోతుందని జగన్‌ చేసిన వ్యాఖ్య దేశవ్యాప్తంగా ఆయన్ను నవ్వులాటగా మార్చింది. కరోనాకు మందు కనుక్కున్నందుకు ఆయనకు నోబుల్‌ ప్రైజ్‌ ఇవ్వాలని సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు’అని చంద్రబాబు ఎద్దేవా చేసారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss