Wednesday, April 21, 2021

Latest Posts

నిజాలు చెప్పండి

chandrababu naidu strong comments on Jagan mohan reddy over corona

రాష్ట్రంలో కరుణ పాజిటివ్ కేసులు దాచిపెట్టి తక్కువ లెక్కలు చెబుతున్నారని ప్రజలు భావిస్తున్నారని ఈ నేపథ్యంలో నిజాలు తెలిపి ప్రజలను అప్రమత్తం చేయాలని, నిజాలు దాచి పెడితే అది ప్రమాదంగా మరే అవకాశముంది అని  ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గార్కి ఒక లేఖ రాశారు. ప్రతి రోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి హెల్త్ బులిటెన్లో నిజాలు వెల్లడించాలి అని కరోనపాజిటివ్ కేసులు దాచిపెట్టి తక్కువ లెక్కలు చెబుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు.  వాస్తవాలు తెలిపి వారిని అప్రమత్తం చేయాలని సూచించారు.  రోజురోజుకూ కరోన కేసులు  రాష్ట్రమంతటా పెరిగి పోతుంటే తేలిగ్గా తీసుకోకూడదు అని అన్నారు. మనకు 4 ల్యాబ్ ఉండటం వల్ల చాలా తక్కువ మందికి మాత్రమే కరోన టెస్ట్లు జరుగుతూన్నాయి, ల్యాబ్లను పెంచితే ఎక్కువ మందికి టెస్ట్ చేయవచ్చు అని దాని వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది అని తెలిపారు.

రాజమండ్రి, విజయవాడలలో కరోన కారణంగా చాలా మంది చనిపోయారు అనే ఊహాగానాలు వస్తున నేపద్యంలో వాటిపై  ప్రభుత్వం స్పందిచాల్సిఉంది. రెడ్ జోన్స్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో ప్రజలు సామాజిక దూరం పాటించకుండా గుంపులుగా చేరి రేషన్ తీసుకుంటున్నారు అలాగే తమ ప్రాణాలను పణంగా పెట్టి కరుణ పై పోరాటం చేస్తున్న వైద్యులకు ఆరోగ్య సిబ్బంది వ్యక్తిగత రక్షణ అందించాల్సి ఉందని మరియు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు అవుట్సోర్సింగ్ సిబ్బంది వేతనాల్లో కోత పెట్టవద్దు అని మెరుగైన విధానాల ద్వారా రాష్ట్ర ప్రజలను కాపాడుతారుఅని ఆశిస్తున్నా అని ఆశాభావం వ్యక్తం చేశారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss