Monday, January 25, 2021

Latest Posts

కరోనా నివారణకు సీఎం సహాయ నిధికి టీడీపీ అధినేత

Chandrababu Naidu to donate Rs 10 lakh to CM relief fund:

మాజీ సీఎం చంద్రబాబు రూ.10లక్షల విరాళం అందజేశారు. రూ.10 లక్షల వ్యక్తిగత విరాళంతో పాటు..ఎమ్మెల్యేల నెల వేతనాన్ని సీఎం సహాయనిధికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనాను ఎదుర్కొనేందుకు అంతా ఐక్యంగా పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. విపత్కర పరిస్థితుల్లో తోచినవిధంగా ప్రజలు సాయం చేయాలని ఆయన సూచించారు.

కాగా లాక్ డౌన్‌పై ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని డీజీపీ సవాంగ్‌ కోరారు. కరోనా నేపథ్యంలో ప్రజలంతా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. కరోనా వ్యాప్తి నివారణ మన చేతుల్లోనే ఉందన్నారు. ఏపీలో అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 330 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కరోనా నియంత్రణ విషయంలో విదేశాల నుంచి అనేక విషయాలు నేర్చుకోవాలని డీజీపీ సవాంగ్‌ సూచించారు.

అత్యవసర సర్వీసులకు మాత్రమే మినహాయింపు ఇస్తామని డిజిపి సవాంగ్ చెప్పారు. ఫోర్‌ వీలర్‌లో ప్రయాణించేందుకు ఇద్దరికే అనుమతిమన్నారు. ఎమర్జెన్సీ అయితే ఇద్దరు మాత్రమే బయటికి రావాలని సూచించారు. అనవసరంగా రోడ్లపై తిరిగితే వాహనాలు సీజ్‌ చేసి కేసు పెడతామని హెచ్చరించారు. విదేశాల నుంచి వచ్చిన వారు 104, 100కి సమాచారం ఇవ్వాలని డీజీపీ సవాంగ్ తెలిపారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss